Saturday, July 4, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ప్రభుత్వం అందించే ఐదు లక్షలతోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలి: ప్రత్యేక అధికారి శ్రీనివాస్

ప్రభుత్వం అందించే ఐదు లక్షలతోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలి: ప్రత్యేక అధికారి శ్రీనివాస్

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం అందించే ఐదు లక్షల నిధులతోనే పనులు చేపట్టుకోవాలని ఇందిరమ్మ లబ్ధిదారులకు మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ సూచించారు. శనివారం మండలంలోని పార్డి( బి ), చాత, డోడర్నా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద ప్రజలకు అండగా ఉండేందుకు ఇందిరమ్మ పథకం ప్రవేశపెట్టి అరులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో మొదటి విడతలో చేపడుతున్న పనులను పరిశీలించగా ప్రభుత్వం అందించే ఐదు లక్షల రూపాయలతో కాకుండా ఇంటి నిర్మాణం కొరకు ఎక్కువ మొత్తం ఖర్చు చేసి అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం అందించే ఐదు లక్షలతోనే ఇంటి నిర్మాణ పనులు చేపట్టేలా చూడాలని లబ్ధిదారులకు సూచించారు.

ఫార్డి బిలోని గ్రామ పంచాయతిలో జరుగుతున్నా ” సార్ ” ప్రక్రియపై బిఎల్ఓ లకు అడిగి తెలుసుకున్నారు గ్రామమలో ఉన్న ఓటర్ జాబితా ఒకడు బందిగా చేపట్టేలా చూడాలని బిఎల్ఓ లకు సూచించారు.అనంతరం  చాత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన  విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించేలా  చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను సూచించారు. అప్పటినుండి డర్నా ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట హౌసింగ్ ఏఈ శ్రీనివాస్ స్థానిక సర్పంచులు ప్రవీణ్ కుమార్, రజితదేవేందర్, బిక్కులాల్ ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వార్డ్ సభ్యులు పంచాయతీ కార్యదర్శులు, బిఎల్ఓ లు   తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -