- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో సోమవారం ఆధార్ కేంద్రాన్ని తహసిల్దార్ ఎండి. ముజీబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త ఆధార్, ఆధార్ లో మార్పులు, ఆధార్ లో నేమ్ చేంజ్, మొబైల్ లింక్ తదితర సేవలను మండల పరిధిలోని గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సునీల్ నార్లవార్, వార్డు సభ్యులు సక్కర్ల నరేష్ కార్యాలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



