- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హోళీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకతి పండుగగా హోళీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతత్వానికి ప్రతీకగా నిలిచే పండుగ అని వారు గుర్తు చేశారు. కులమతాలకతీతంగా ప్రజల సమైక్యతను చాటే పండుగ హోళీ అని అన్నారు. ”ఈ పండుగ రంగులు చల్లుకోవడం ద్వారా జాతీయ సమైక్యతపై మన నమ్మకాన్ని, విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది. చెడుపై మంచి విజయానికి ప్రతీక హోళీ” అని వారు పేర్కొన్నారు. సహజ సిద్ధమైన రంగులు, సాంప్రదాయ పద్ధతులతో పండుగను జరుపుకోవాని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు
- Advertisement -



