Sunday, July 5, 2026
E-PAPER
Homeక్రైమ్ఘోర రైలు ప్రమాదం..నలుగురు మృతి

ఘోర రైలు ప్రమాదం..నలుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఏలూరు జిల్లాలో నిన్న రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం చెబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ప్రత్యేక రైలు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక పురుషుడు, ముగ్గురు మహిళలు ఉండగా.. వారి వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చర్లపల్లి నుంచి షాలిమార్ వెళ్తున్న ప్రత్యేక రైలు, చెబ్రోలు సమీపంలో రైలు పట్టాలపై వెళ్తున్న నలుగురిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు మృతదేహాలు ఛిద్రమవ్వడంతో మృతులను గుర్తించడం కష్టతరంగా మారింది. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆత్మహత్య అయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -