నవతెలంగాణ – హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేపలు పట్టడానికి వెళ్లి బావిలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ మండలం కాజీరామారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బొలుగురు నరేష్ కుమారుడు లక్కీ , బొంగరాల శంకర్ కుమారుడు పండు ఇద్దరు శనివారం గ్రామంలో పాఠశాల వదిలిపెట్టగానే చేపలు పట్టడానికి గాలం తీసుకొని సమీపంలో ఉన్నటువంటి గచ్చుబావి దగ్గరికి వెళ్లారు. అందులో చేపలు పట్టడానికి గాలం వేసి ప్రమాదవశాత్తు జారిపడి మృత్యువాత పడ్డారు. రాత్రి వరకు ఇద్దరు పిల్లలు రాకపోవడంతో గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలు ద్వారా ఎక్కడికి వెళ్లారు అనేది గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రాత్రి బావిలో నీటిని కొంతవరకు తోడగా రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరు పిల్లలు ఒకరినొకరు హత్తుకొని మృత్యువాత పడడంతో తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులంతా కన్నీరు మున్నీరు అయ్యారు.
చేపలు పట్టడానికి వెళ్లి ఇద్దరు బాలురు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



