Friday, August 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలునెక్లెస్ రోడ్డులో ఫూలే దంప‌తుల విగ్రహాల ఆవిష్కరణ

నెక్లెస్ రోడ్డులో ఫూలే దంప‌తుల విగ్రహాల ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మ‌హాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంప‌తుల విగ్రహాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. భాగ్య నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆయన ఇవాళ (శుక్రవారం) ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, ఆర్.కృష్ణయ్య, సురేశ్ షెట్కర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, మందుల సామేల్, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంత రావు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -