- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హర్మూజ్ జల సంధి గుండా వెళ్లే నౌకలపై కొత్త సేవా రుసుములను విధిస్తామని చైనాలో ఇరాన్ రాయబారి తెలిపారు. అయితే.. ఇటీవల ఘర్షణల సమయంలో ఇరాన్‌కు మద్దతు ఇచ్చిన దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యూహాత్మక జల మార్గం ద్వారా వెళ్లే నౌకల రవాణాను నిర్వహించడానికి కొత్త ఏర్పాట్లపై ఒమన్‌తో కలిసి ఇరాన్ పనిచేస్తుందని వెల్లడించారు. నౌకలపై రుసుముల ఆలోచనను అమెరికా తిరస్కరించినప్పటికీ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
- Advertisement -



