Friday, August 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుదసరా కానుకగా రిలీజ్‌

దసరా కానుకగా రిలీజ్‌

- Advertisement -

న్యూ ఏజ్ క్రైమ్ కామెడీతో ‘బా బా బ్లాక్ షీప్’ సినిమా తెరకెక్కుతోంది. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తు న్నారు. గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, క‌శ్య‌ప్‌, రాజారవీంద్ర‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేఘాల‌యా రాష్ట్రంలో పూర్తిగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకున్న తొలి ద‌క్షిణాది సినిమా ఇదే కావ‌టం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను సంగీత దర్శకుడు దేవిశ్రీప్ర‌సాద్ రిలీజ్ చేశారు. సాంగ్ యూత్‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉంద‌ని, డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని దేవిశ్రీప్ర‌సాద్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఇదొక పార్టీ సాంగ్‌. ప్ర‌ధానంగా అక్షయ్ ల‌గుసాని, విష్ణు ఓయ్ ల‌పై ఈ ఎన‌ర్జిటిక్ సాంగ్‌ను క‌ల‌ర్‌ఫుల్‌గా చిత్రీక‌రించారు. ఎల‌క్ట్రానిక్ కిలి, ఆనంద్(ఆర్కాడొ) సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాట‌ను కిట్టు విస్సాప్ర‌గ‌డ రాయ‌గా..బెన్నీ ద‌యాల్ పాడారు. నిర్మాత‌ వేణు దోనేపూడి మాట్లాడుతూ, ‘ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చుట్టూ తిరిగే కాన్సెప్ట్‌తో రూపొందించాం. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 9న సినిమా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాం. మా డైరెక్ట‌ర్ గుణి, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు స‌హా ఎంటైర్ టీమ్‌ స‌హకారంతో ఇది సాధ్య‌మైంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -