Tuesday, March 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాముడి దహనం, హోలీ సంబరాల్లో సర్పంచ్

కాముడి దహనం, హోలీ సంబరాల్లో సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం రాత్రి కామదహనం చేశారు. మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు హోలీ రంగుల ఉత్సవాలు జరుపుకున్నారు. హోలీ ఉత్సవాల్లో భాగంగా సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి ఇంటి వద్ద సర్పంచ్ దంపతులతో పాటు చిన్న షక్కర్గా గ్రామ సర్పంచ్ దిగంబర్ దంపతులు ఆ గల్లీలోని పలువురు దంపతులు కలిసి ఆనందోత్సవాల మధ్య హోలీ రంగులు ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ దంపతులకు గల్లి వాసుల దంపతులు రంగులు చల్లి హోలీ ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ ఉత్సవాలు సర్పంచ్ ఇంటి వద్ద ఆట పాటలతో డ్యాన్సులు చేస్తూ ఘనంగా ఉత్సవంగా ఆనందంగా జరుపుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -