Monday, July 6, 2026
E-PAPER
Homeజాతీయంజమ్ములో భారీ వర్షాలు..చీనాట్ నదికి పొటెత్తిన వరద

జమ్ములో భారీ వర్షాలు..చీనాట్ నదికి పొటెత్తిన వరద

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూలో కురుస్తున్న భారీ వర్షాలకు చీనాట్ నదికి వరద పొటెత్తింది. దోడా జిల్లాలో రహదారి అనుసంధానానికి అంతరాయం కలగడంతో పాటు, కిష్త్వార్ జిల్లాలోని 540 మెగావాట్ల క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. భారీ వరదలతో ప్రేమ్‌నగర్ వద్ద జాతీయ రహదారి 244ను మూసివేశారు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. హదారికి ఇరువైపులా అనేక వాహనాలు చిక్కుకుపోయాయి. అధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు పునరుద్ధరించేందుకు శ్రమిస్తున్నారు. రటెయిల్‌రేస్ టన్నెల్ (TRT) ప్రదేశంలో, భారీగా నీరు, బురద ప్రవహించి ఆ ప్రాంతాన్ని ముంచెత్తడంతో, అనేక వాహనాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. ప్రాజెక్ట్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. సహాయక, తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -