- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలతో మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాష్ చిక్ బారైక్ రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. భారత ఎన్నికల సంఘం ఈ మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జులై 24వ తేదీన మూడు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జులై 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. నామినేషన్ల సమర్పణకు జులై 14 ఆఖరి తేదీ అని పేర్కొంది.
- Advertisement -



