Monday, July 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సావర్ గావ్ అంగన్వాడీలో అన్నప్రాసన

సావర్ గావ్ అంగన్వాడీలో అన్నప్రాసన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని సావర్ గావ్ తాండ గ్రామంలో సోమవారం అంగన్వాడి టీచర్ బుజ్జి బాయ్ ఆధ్వర్యంలో అన్నప్రాసన, పిల్లలకు వైద్య పరీక్షలు, పౌష్టికాహారం అందజేశామని జిపి కార్యదర్శి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిపీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గర్భిణీలకు , బాలింతలకు , పౌష్టికాహారం తీసుకోవడం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన పోషక పదార్థాలు అంగన్వాడీలో లభిస్తాయని తెలిపారు. అదేవిధంగా గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమము నిర్వహించారు. అనంతరం చిన్నారుల ఎత్తు, బరువు పరీక్షించారు. అదేవిధంగా పౌష్టికాహారం బాలామృతం ప్యాకెట్లు బాలింతలకు , గర్భిణీలకు, పిల్లలకు , అందజేశారు. అనంతరం గ్రామంలో అర్హులైన చిన్నపిల్లలకు అంగన్వాడి కేంద్రం లో చేర్పించాలని కోరుతు తాండలోని ఇంటింటికి తిరిగి అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు వార్డు సభ్యులు పరశురాం , బాలాజీ , అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్త, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -