Sunday, September 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నల్లగుట్ట తండాలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ

నల్లగుట్ట తండాలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు 
మండలంలోని నల్లగుట్ట తండాలో రేషన్ కార్డుల లబ్ధిదారులకు నూతన రేషన్ స్మార్ట్ కార్డులను అందించినట్లు ఆ గ్రామ సర్పంచ్ గుగులోతు హేమలత శ్రీనివాస్ జిపిఓ ఉప్పలయ్య తెలిపారు. ఆదివారం గ్రామపంచాయతీ ఆవరణలో అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఈ కార్డును పొంది రేషన్ నుంచి వచ్చే సంక్షేమం పథకాలను పొందాలని తెలిపారు. గత ప్రభుత్వం పేదలను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. పేదల బాగోగుల కోసమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నూతనంగా రేషన్ కార్డులను ఇచ్చిందని అన్నారు. ఈ రేషన్ కార్డులను మాకు అందించిన ప్రజాప్రతితులకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మణ్ పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ  గ్రామపంచాయతీ సిబ్బంది బానోతు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -