Sunday, September 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్25 వసంతాలకు కలిసిన వేళ.. అపూర్వ సమ్మేళనం 

25 వసంతాలకు కలిసిన వేళ.. అపూర్వ సమ్మేళనం 

- Advertisement -


2001-2002వ బ్యాచ్ పూర్వ విద్యార్థులు
నవతెలంగాణ-నెల్లికుదురు

మండల కేంద్రానికి సమీపంలోని రామకృష్ణ గురుకుల పాఠశాలలో 2001-2002 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యను అభ్యసించిన విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి విద్యను అభ్యసించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక అమూల్య గార్డెన్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అలనాటి గురువులను సత్కరించడంతోపాటు వారి అమూల్య సందేశాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి కూరపాటి క్రాంతి  అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలోపూర్వ ఉపాధ్యాయులు టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు బాలాస్టి రమేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యను కేంద్రీకృతం చేసే పరిస్థితి దాపురించిందని, ప్రభుత్వం బడులలోనే నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని వాటి పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా కదలాల్సిన అవసరం ఉందన్నారు.

విద్యార్థులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుత సోషల్ మీడియా అసత్య ప్రచారాలకు స్పందించవద్దని, రీల్స్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వంటే వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. అదే క్రమంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ మారుతున్న సమాజానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు మార్పు కోరుకోవాలని చేతనైనంత మేరకు సహాయం చేయాలన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన విద్యార్థులు స్థిరపడని మిత్రులకు సహాయ సహకారాలు అందించి ఔదార్యం చాటాలున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులను ఘనంగా శాలువాతో సత్కరించి మెమొంటోలు అందజేశారు. అనంతరం ఆటపాటలతో ఆనంద ఉత్సవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అలనాటి ఉపాధ్యాయులు ఉప్పలయ్య, సాయికుమార్, కృష్ణమాచారి, ఉప్పలయ్య ( ఇంగ్లీష్ )గొల్లపల్లి విజయబాబు గౌడ్, కందగట్ల రమేష్, సాయికుమార్, పెరుమాండ్ల కుమార్, రాస వెంకటరెడ్డి, రాధాకృష్ణ, బ్రహ్మయ్య, బొడ్డు యాకయ్య, అలనాటి పేరెంట్స్ కమిటీ బాధ్యులు పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్, కూరపాటి వెంకటేశ్వర్లు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -