Sunday, September 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో ఘనంగా బోనాల పండుగ 

మండలంలో ఘనంగా బోనాల పండుగ 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని పలు గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచ్ ఆధ్వర్యంలో ఆదివారం ముత్యాలమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.గ్రామాలలోని మహిళలు బోనాలను అందంగా అలంకరించుకొని అమ్మవారికి బోనాలను సమర్పించారు. డప్పు చప్పుళ్ళు,శివసత్తుల శిగాలు,డీజే పాటలు,పోతురాజుల విన్యాసాలతో గ్రామాలలో సందడి వాతావరణం నెలకొన్నది. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచ్ లు,పాలకవర్గం సభ్యులు,గ్రామ పెద్దలు,మహిళలు,యువకులు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -