Sunday, September 6, 2026
E-PAPER
Homeఖమ్మంశ్రామికుల సమష్టి కృషితో ప్రగతి పథంలో 'వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్'

శ్రామికుల సమష్టి కృషితో ప్రగతి పథంలో ‘వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్’

- Advertisement -

నవతెలంగాణ-వైరా
వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా 1996లో దీవెల వెంకటేశ్వరరావు, మురళీధర్ భూతడ ప్రారంభించిన ‘వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ మూడు దశాబ్దాల ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలను ఎదుర్కొని నిలబడింది. ఆదివారం  రైతులు, డీలర్లు, వినియోగదారుల ప్రత్యేక కలయికతో తమ అనుభవాలను యాజమాన్యం పంచుకుంది. 2007 – 2014 మధ్య కాలంలో రోజూ 2 లక్షల లీటర్ల పాల విక్రయం, లక్ష లీటర్ల సేకరణతో కంపెనీ స్వర్ణయుగాన్ని చూసింది. అయితే, 2019లో వ్యవస్థాపకులు దీవెల వెంకటేశ్వరరావు అనారోగ్యం, ఆర్థిక ఒడుదొడుకుల వల్ల సంస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. ఆ సమయంలో భూతడ మురళీధర్, దుర్గాలాల్ సారథ్యంలో కుటుంబ సభ్యులు, సిబ్బంది, దశాబ్దాలుగా పనిచేస్తున్న నమ్మకమైన పంపిణీదారుల మద్దతుతో కంపెనీని పునరుద్ధరించారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటూ, మాకు మేమే పోటీ అనే సంకల్పంతో మేనేజ్‌మెంట్ పద్ధతులను మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తున్నారు. త్వరలోనే మరిన్ని కొత్త ఉత్పత్తులతో విస్తరించనున్నామని, భవిష్యత్తులోనూ అందరి సహకారం కావాలని వైరా వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్ మేనేజర్ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -