- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆలేర్ పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు, సోమవారం నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలలో ఆలేరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, గెజిట్ నోట్ ప్రకటించాలని కోరుతూ, సభ్యులు ప్లే కార్డులు ప్రదర్శించనున్నారు. ప్లే కార్డుల ప్రదర్శన కార్యక్రమం సభ్యులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని, రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం ఆదివారం విలేకరులకు ఒక ప్రకటనలో తెలియజేశారు.
- Advertisement -


