- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : యూజీసీ-నీట్ పునఃపరీక్ష వ్యవహారంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీనికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని బాధ్యుల్ని చేయాలని డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. మోదీజీ.. సోషియాలజీ, ఇంగ్లీష్, కామర్స్ సబ్జెక్టులకు UGC-NET పరీక్షలు జూన్ 22, 30 మధ్య జరిగాయి. ఎన్టీఏ వాటిని రద్దు చేసి సెప్టెంబర్‌లో పరీక్షలు పెడతానంటోంది. తప్పు ఎన్‌టీఏ చేస్తే, శిక్షను విద్యార్థులు అనుభవిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.
- Advertisement -



