Tuesday, July 7, 2026
E-PAPER
Homeఆటలువన్డే జట్టులోకి శివమ్ దూబే..

వన్డే జట్టులోకి శివమ్ దూబే..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో సీమ్-బౌలింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సోమవారం ధ్రువీకరించారు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో నితీశ్‌ రెడ్డి తొడ కండరాల గాయానికి గురయ్యాడని, అతను ఇంకా పూర్తిగా కోలుకోనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్‌లోనే ఉన్న శివమ్ దూబే, వన్డే సిరీస్ కోసం అక్కడే జట్టుతో కొనసాగుతాడని సైకియా వివరించారు. ఈ గాయం కారణంగానే నితీశ్ రెడ్డి ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లతో పాటు, జరగబోయే జింబాబ్వే పర్యటనకు కూడా దూరమయ్యాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -