- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భువనగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. 1978, 1983లో రెండు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 300 ఎకరాల భూమిని భూదానోద్యమానికి దానం చేసి ‘భూదానశీలి’గా పేరు పొందారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, అనుచరులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన పార్ధివ దేహాన్ని హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉంచగా, అంత్యక్రియలు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బ్రాహ్మణపల్లి గ్రామంలో జరగనున్నాయి.
- Advertisement -



