Wednesday, July 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరేపు ముగియనున్న అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు

రేపు ముగియనున్న అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: రేపు (గురువారం) ఇరాన్ సుప్రీం లీడర్  అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగియనున్నాయి. ఇరాన్‌లో ప్రారంభమైన ఆరు రోజుల జాతీయ సంతాప దినాల్లో భాగంగా,షియా ముస్లింల పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాల్లో ఖమేనీకి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇరాక్ ప్రభుత్వం బుధవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. నజాఫ్‌లోని పవిత్ర ఇమామ్ అలీ దర్గా వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర సాగింది. అమెరికా, ఇజ్రాయెల్‌లను ఎదిరించిన నేతకు నివాళులర్పించేందుకు ఇరాక్ నలుమూలల నుంచే కాక, ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. గురువారం ఇరాన్‌లోని ఖమేనీ స్వస్థలమైన మషద్ నగరంలో అంత్యక్రియలు పూర్తికానున్నాయి. గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -