Wednesday, July 8, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ముథోల్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు

ముథోల్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల గంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం రావుల గంగారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ పేదలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. రైతు సంక్షేమానికి విశేష కృషి చేసిన రైతు బాంధవుడిగా ఆయన నిలిచారన్నారు. ఆయన హయాంలో ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ వంటి సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్ పాతంగే,,రావుల శ్రీనివాస్ , అజీజ్ ,గోవింద్ పటేల్, నగేష్, రాజు, లక్ష్మణ్, దిగంబర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -