నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద బుధవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ సభ్యుడు వేణుగోపాల్ యాదవ్ పాల్గొని రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బోనగిరి భాస్కర్ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హాయంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అన్నారు. ప్రజలకు ఉచిత వైద్యం కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం, 108 అంబులెన్సులు ప్రజలకు ఎంతగానో సేవలందిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి చిరస్మరణీయ నాయకుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పాలేపు నర్సయ్య, మాజీ అధ్యక్షులు సుంకేట రవి, డీసీసీ నాయకులు ఏలేటి మోహన్ రెడ్డి, మురళి, తిప్పిరెడ్డి శ్రీనివాస్, తక్కురి దేవేందర్, లక్ష్మణ్, బద్దం రాజేశ్వర్, సర్పంచులు నలిమేలా గంగారెడ్డి, దశరథ్, అశోక్, గుడిసె అంజమ్మ, గ్రామ శాఖ అధ్యక్షులు గణేష్, నరేష్, రవీందర్, భూమేష్, యూత్ ఉపాధ్యక్షలు శైలేందర్, జగదీష్, కొమ్ముల రవీందర్, బుచ్చిమల్లయ్య, నిమ్మ ప్రసాద్, బాలయ్య, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



