Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వయోవృద్ధుల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

వయోవృద్ధుల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేర్ రూరల్ 
ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో మంగళవారం వయోవృద్ధుల కమిటీ ఏర్పాటు సమావేశం నిర్వహించారు.గ్రామ సర్పంచ్‌ వడ్ల శోభన్‌బాబు ఉపసర్పంచ్‌,వార్డు సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా కమిటీ సభ్యులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ, ఒగ్గు క్రిష్టఫర్‌,మండల కమిటీ సభ్యులు పరిగల రాములు హాజరయ్యారు.ఈ సందర్భంగా సుమారు 30 మంది వయోవృద్ధుల సమక్షంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కమిటీ అధ్యక్షుడిగా చౌడాపోయిన సంజీవులు,ప్రధాన కార్యదర్శిగా గిరిపోయిన సత్తయ్య ఎన్నికయ్యారు.గౌరవ సలహాదారులుగా నరసమ్మ,వజ్రమ్మ, శాంతమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.వయోవృద్ధుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమం కోసం కమిటీ సమష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు.గ్రామంలోని వయోవృద్ధులందరినీ కలుపుకొని వారి హక్కులు,సంక్షేమ పథకాలు,ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు,జిల్లా,మండల కమిటీ ప్రతినిధులతో పాటు గ్రామంలోని వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -