Wednesday, July 8, 2026
E-PAPER
Homeక్రైమ్వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి, మరొకరు కోమాలో

వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి, మరొకరు కోమాలో

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూరు మండలం హౌజుబుజుర్గు గ్రామంలో బుధవారం రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మొదటి ఘటనలో గ్రామానికి చెందిన తాల్లపల్లి రాజేందర్ (45) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేందర్ రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో అటుగా వేగంగా వస్తున్న లారీ అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజేందర్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు.

రెండో ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన షేక్ షాలిహ(23) హనుమకొండ నుండి ఆటోలో తన కుటుంబంతో స్వగ్రామానికి వస్తుండగా పత్తిపాక క్రాస్ వద్ద లారీ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షాలిహకు తలకు తీవ్ర గాయాలై అధిక రక్తస్రావం అయింది. కుటుంబ సభ్యులు 108 సహాయంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసినప్పటికీ ఆమె కోమాలోకి వెళ్లిందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఒకే రోజు ఒకే గ్రామానికి చెందిన ఇద్దరికి జరిగిన ఈ ప్రమాదాలతో హౌజుబుజుర్గు గ్రామ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -