నవతెలంగాణ – ఉప్పునుంతల
తెలంగాణ ప్రభుత్వం వానకాలం సాగు పెట్టుబడి కోసం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయడంతో ఉప్పునుంతల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. మండల కేంద్రంలో పోచమ్మ చౌరస్తాలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకున్నారు.
టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కట్టా అనంతరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కర్నె లక్ష్మీనారాయణ, ఉప్పునుంతల సర్పంచ్ చింతగల శ్రీనివాసులు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మేడమోని భాస్కర్, మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, ఉమామహేశ్వర దేవస్థాన డైరెక్టర్ బొల్లె లక్ష్మీ, బీసీ సెల్ అధ్యక్షులు మడ్డి తిరుపతయ్య గౌడ్, మండల నాయకులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, యువజన నాయకులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



