Friday, March 6, 2026
E-PAPER
Homeసినిమాఓ సాధారణ మనిషి కథ..

ఓ సాధారణ మనిషి కథ..

- Advertisement -

పాత్‌వే ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అరుణ్‌ రంగరాజులు నిర్మాతగా రామ్‌ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్‌ కుమార్‌, బడవ గోపీ, కోతండం, కరణ్‌ చక్రవర్తి, శంకర నారాయణ్‌ వి, హరిత పరాకోడ్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ చేయనున్నట్టు గురువారం ప్రకటించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ పీవీఆర్‌ ఐనాక్స్‌ పిక్చర్స్‌ ఈ చిత్రానికి అధికారిక థియేట్రికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ పార్ట్‌నర్‌గా చేరింది. దేశవ్యాప్తంగా పీవీఆర్‌ సంస్థ తమ విస్తరణను మరింత బలపరుచుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం నిజాయితీతో జీవించే ఒక సాధారణ కార్‌ డ్రైవర్‌ సెల్వం జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగుతాడు అనే అంశాన్ని భావోద్వేగ భరితంగా చూపించనున్నారు.

ఒక సాధారణ మనిషి మనసులోని మాటగా ప్రారంభమయ్యే ఈ కథ, నిజాయితీ, జీవన పోరాటం మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యాన్ని ప్రతిబింబించే హై స్టేక్స్‌ డ్రామాగా మారుతుంది. దర్శకుడు రామ్‌ చక్రి మాట్లాడుతూ, ‘ఇదొక సాధారణ మనిషి కథ. ఈ కథను తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పీవీఆర్‌ ఐనాక్స్‌ పిక్చర్స్‌ మా చిత్రానికి థియేట్రికల్‌ పార్ట్‌నర్‌గా ఉండటం వల్ల ఈ కథ మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకులకు చేరుతుందని నమ్ముతున్నాం. ఓ మంచి కథతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -