- Advertisement -
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీతో భేటీ
భౌగోళిక రాజకీయ పరిస్థితులపై చర్చ
న్యూఢిల్లీ : జర్మనీలోని డై లింకే పార్టీ నుంచి ఫిలిప్ డెగెన్‌హార్స్ట్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఢిల్లీలోని ఏకే గోపాలన్ భవన్‌ను సందర్శించింది. అనంతరం సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు, అంతర్జాతీయ విభాగం అధిపతి ఆర్ అరుణ్ కుమార్, కేంద్ర సెక్రెటేరియట్ సభ్యుడు వి మురళీ ధరన్‌లను కలిసింది. ఈ సందర్భంగా రెండు పార్టీలు ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులపై అభిప్రాయాలను పంచుకున్నాయి. వారి స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అంగీకరించాయి.
- Advertisement -



