అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలి

– ఐసిడిఎస్ పిడి తో యూనియన్ నాయకులు చర్చలు
నవతెలంగాణ కంఠేశ్వర్
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ ఫర్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లాకు కొత్తగా వచ్చిన ఐసిడిఎస్ పీడీ ని మర్యాదపూర్వకంగా కలిసి  సత్కరించటం తో పాటు జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించటం జరిగింది. ప్రధానంగా సకాలంలో పౌష్టిక ఆహారం సంబంధించిన బియ్యము గుడ్లు, పప్పులు, నూనె అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో చేర్చకపోవటంతో లబ్ధిదారులకు అందించలేకపోతున్నామని వారు తెలిపారు. రోజువారి పని ఒత్తిడి ఉండటంతో పాటు ప్రభుత్వం బి ఎల్ ఓ డ్యూటీ లను వేయటం మూలంగా అటు ఫ్రీ స్కూల్ నడపటం, రోజువారి ఆన్ లైన్ రిపోర్ట్ లు పంపటం ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కేంద్రాలకు చేర్చ లేకపోతు ఉన్నామని అందువల్ల బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని వారు కోరారు సెంటర్ అద్దెలను, డి ఏ డి ఏ లను నెలనెలా చెల్లించాలని తెలిపారు. అంగన్వాడి సమస్యలను పరిష్కరించటానికి తన వంతు సహాయం చేస్తానని ఐసిడిఎస్ పిడి యూనియన్ నాయకులతో తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు, జిల్లా అధ్యక్షులు కే దేవగంగు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ, జిల్లా కోశాధికారి చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షులు మంగాదేవి మరియు జిల్లా నాయకులు పి వాణి, సరిత, జ్యోతి, గోదావరి తదితరులతోపాటు ఆయా ప్రాజెక్టుల నాయకులు పాల్గొన్నారు.
Spread the love