రేపు చలో గాంధీ భవన్

నవతెలంగాణ – సిద్దిపేట 
రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేపు చలో గాంధీ భవన్ ముట్టడి ఉంటుందని  అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ తెలిపారు.  ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకర్ల సమావేశంలో సిద్దిపేట జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు మామిళ్ళ ఐలయ్య యాదవ్ తో కలిసి ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ గత 15 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా యాదవులు, కురుమలు పెద్ద ఎత్తున నిరసన తెలిపినా తను క్షమాపణ చెప్పడం లేదని అన్నారు.  అనేక పోరాటాలలో చాలామంది ప్రగతిశీల రెడ్డిలు సామాజిక శక్తులతో కలిసి భాగస్వామైనారని,  కానీ ఇలాంటి అహంకార స్వభావం ఉన్న రేవంత్ రెడ్డి వల్ల రెడ్డి కులానికి గౌరవాన్ని తగ్గిస్తాయన్నారు. ఈ నెల 25న  హైదరాబాదు ఇందిరాపార్కు దగ్గర రాష్ట్రవ్యాప్తంగా వందలాది దున్నపోతులతో,  యాదవ యోధులతో ధర్నా నిర్వహించి అనంతరం గాంధీభవన్ ముట్టడికి తరలి వెళ్తున్నామని అన్నారు.  జిల్లా నుండి హైదరాబాద్ కు పెద్ద ఎత్తున  తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో  సిద్దిపేట పట్టణ అధ్యక్షులు పయ్యావుల ఎల్లం యాదవ్, సిద్దిపేట జిల్లా గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటేశం యాదవ్, కొండపాక మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్, సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షులు ఉడుత రవి యాదవ్, నంగునూరు మండల అధ్యక్షుడు వడితం కిరణ్ కుమార్ యాదవ్, చిన్నకోడూరు మండల అధ్యక్షులు కన్నెబోయిన రాజు యాదవ్, జిల్లా నాయకులు రాజబోయిన పరశురాముల యాదవ్, కాటుక నరసింహులు యాదవ్, జిల్లా యువత నాయకులు సందబోయిన నాగరాజు
యాదవ్, కిషన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love