పల్లె సంబరం 

  • దశాబ్ది ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు 
  •  ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 
  •  జూన్ 2 నుండి 22 వరకు ప్రత్యేక కార్యక్రమాలు 
  • గ్రామాల్లో అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ,ప్రజాప్రతినిధులు 
  •  పల్లెల్లో నెలకొన్న కోలాహలం 
నవతెలంగాణ దుబ్బాక రూరల్ 
ఉమ్మడిఆంధ్రపాలనలోతెలంగాణకు జరిగిన అన్యాయం అంతా, ఇంతాకాదని అందరికీ తెలుసు .ఆంధ్రపాలకుల చేతిలో తెలంగాణ పూర్తిగా బానిసత్వానికి గురైంది. స్వాతంత్ర్యం ఏర్పడి నాటి నుండి ఉమ్మడి ఆంధ్ర పాలకుల పరిపాలనలో తెలంగాణపై వివక్ష జరిగింది.దీంతో విసుగు చెంది ఆనాటి పాలకులు చేస్తున్న అన్యాయం,మోసన్ని సిఎం కేసీఆర్  తెలుసుకుని స్వరాష్ట్ర సాధనకు మలి, తొలిదశ ఉద్యమాల్లో ప్రజలకు ఉత్తేజపరిచి  అనేక పోరాటాలు చేశారు. సకలజనుల సమ్మెతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలంతా ఏకతాటిపై నడిచి విన్నూత రకాల నిరసనలు, పోరాట ఉద్యమాలు చేశారు. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ జూన్. 2. 2014 న ప్రత్యేక తెలంగాణను ప్రకటించారు. ఆనాటి పాలకులపై సీఎం కేసీఆర్ సకల జనులతో కలిసి చేసిన పోరాట ఫలితం ఈ తెలంగాణ.రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వం.
10 వసంతంలోకి అడుగు…
బీఆర్ఎస్(టీఆర్ఎస్) ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రజలకు మంచి పాలనను అందిస్తూ…. 2 పర్యాయాలుగా తెలంగాణలో గెలిచిన 9ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు,అభివృద్ధి తీరును ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తుంది. 9వసంతాలు పూర్తి చేసుకుని 10 వ ఏటా లో అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దశాబ్ది ఉత్సవాల గ్రామ గ్రామన నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.ఈ దశాబ్ది ఉత్సవాలను గ్రామ గ్రామన అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో కలిసి  ఉత్సవాలు జరపాలని దిశా నిర్ధేశం చేసింది.ఇందుకు సంబంధించి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి అవగాహన సదస్సులను కూడా నిర్వహించారు.
జూన్2 నుండి 22 వరకు ప్రత్యేక కార్యక్రమాలు
  • జూన్ 2 న ప్రారంభోత్సవం
    ఈ కార్యక్రమం సీఎం కేసీఆర్ గన్ పార్క్ వద్ద అమరవీరుల2 స్థూపం వద్ద నివాళ్ళు అర్పించి… అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో సీఎం పతాకావిష్కరణ చేసినంతరం ప్రతి జిల్లాలో అధికారులతో కలిసి మంత్రులు,ఎమ్మెల్యే లు ఉత్సవాలను ప్రారంభించనున్నారు.
  • జూన్ 3 తెలంగాణ రైతు దినోత్సవం
  • జూన్4 సురక్షా దినోత్సవం
  • జూన్ 5 తెలంగాణ విద్యుత్ విజయోత్సవం
  • జూన్ 6 తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం
  • జాన్ 7 సాగునీటి దినోత్సవం
  • జూన్ 8 ఊరూరా చెరువుల పండగ
  • జూన్ 9 తెలంగాణ సంక్షేమ సంబురాలు
  • జూన్ 10 తెలంగాణ సుపరిపాలన దినోత్సవం
  • జూన్ 11  తెలంగాణ సాహిత్య దినోత్సవం
  • జూన్ 12 తెలంగాణ రన్
  • జూన్ 13 తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం
  • జూన్ 14 తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం
  • జూన్ 15 తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం
  • జూన్ 16 తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం
  • జూన్ 17 తెలంగాణ గిరిజనోత్సవం
  • జూన్18 తెలంగాణ మంచినీళ్లు పండగ
  • జూన్ 19 తెలంగాణ హరితోత్సవం
  • జూన్ 20 తెలంగాణ విద్యాదినోత్సవం
  • జూన్ 21 తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం
  • జూన్ 22 అమరుల సంస్మరణ
    ఈ కార్యక్రమాలను ప్రతి గ్రామంలో అధికారుల ,ప్రజా ప్రతినిధుల అనుసంధానం ఈ కార్యక్రమాలు నిర్వహించనుండటంతో పల్లెలన్నీ సంబురమయంలో మునిగి తేలనున్నాయి.ఈ ఉత్సవాలతో దుబ్బాక మండలంలోని 30 గ్రామాల్లో పండుగ వాతావరణం( కోలాహలం) నెలకొననుంది.
ఏర్పాట్లు సర్వం సిద్ధం: ఎంపీడీఓ భాస్కర శర్మ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుండి 22వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు మండలంలోని 30 గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు పలు శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం.ప్రభుత్వ పనితీరు చేస్తున్న అభివృద్ధిని చాటి చెప్పడమే ఈ కార్యక్రమ ఉద్దేశం.ఈ ఉత్సవాల గురించి అందరికీ అవగాహన పరిచాం.
 దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి: ఎంపీపీ కొత్త పుష్పాలత కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం జూన్ 2 నుండి 22 వరకు దశాబ్ది ఉత్సవాల పేరిట వేడుకలు నిర్వహించనుంది. ప్రజలతో మమేకమై దశాబ్ది ఉత్సవాలను అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ కలిసి విజయవంతం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పొందిన లబ్ధిదారుల సైతం భాగస్వామ్యం అయ్యేవిధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.సీఎం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయయం.
Spread the love