కళాకారులకు అండగా తెలంగాణ ప్రభుత్వం


ఎడ్ల సుధాకర్‌ రెడ్డి
నవతెలంగాణ-అంబర్‌పేట
కవులకు కళాకారులకు రచయిత లకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధా లుగా ప్రోత్సహిస్తుందని అంబర్‌పేట బీఆర్‌ ఎస్‌ అంబర్‌పేట ఇన్‌చార్జీ ఎడ్ల సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం తెలం గాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సాహిత్య దినోత్సవం కవి సమ్మేళనం కవితల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబర్పేట్‌ రోడ్‌నెం.6లో శ్రీరామ్‌ మంధీర్‌లో వాహిద్య కళాకా రులూ, సాహితి కళామనులకు, సంగీత కళాకారులకు, మైనారిటీ కళాకారులకు అంబర్‌పేట నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీ ఎడ్ల సుధాకర్‌రెడ్డి వారిని ఘనంగా శాలువా కప్పి పూలహారం వేసి ఘనంగా సత్కా రించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు గరిగంటి రమేష్‌, మాజీ కార్పొరేటర్‌ పులి జగన్‌, యువ నాయకులు నాగేష్‌ గౌడ్‌ రాష్ట్ర మహిళా నాయకులు దేవి రెడ్డి విజత రెడ్డి ,ఉద్యమ నాయకులు జీవన్‌ గౌడ్‌,బీవీ రమణ,కోట్ల రాము, అనిల్‌ యాదవ్‌, జనార్దన్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love