గొల్ల రామవ్వ నాటి తెలంగాణ జీవన నాటక ప్రదర్శన

నవతెలంగాణ-కల్చరల్‌
తెలంగాణ ప్రాంతంలో సామాజిక పరిస్థితులు, ప్రజల జీవన గతులు 1947 సంవత్సరానికి ముందు ఎలా ఉండేవో వాస్తవాలకు దశ్య రూపంలో గొల్ల రామవ్వ నాటకం ప్రదర్శితమైంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా భాష సాంస్కతిక శాఖ నిర్వహణలో రవీంద్రభారతి ప్రధాన వేదికపై పూర్వ ప్రధాని పీ.వీ.నరసింహరావు రచించిన గొల్ల రామవ్వ కథóను అజరు మం కెనపల్లి నాటకీకరించి దర్శకత్వంలో ప్రదర్శించారు. ఆధునిక సాంకేతిక పరి జ్ఞానం పరిపూర్ణంగా వాడుకుని రెండుగంటల పైగా సాగిన నాటకంలో పాత్రల ఎంపికలో దర్శకత్వ నైపుణ్యం ద్యోతకమైంది. సాంస్కతిక శాఖ సంచాలకుడు డాక్టర్‌ మామిడి హరి కష్ణ నాటకం చూసి స్పందించి మాట్లాడుతూ తెలంగాణ జీవన చిత్రం మట్టి వాసనలు ఈ గొల్ల రామవ్వలో ఉన్నాయన్నారు. తెలంగాణ వచ్చిన తరువాతనే ఇక్కడి వారి ప్రతిభ వెలుగు చూస్తోందని అన్నారు.

Spread the love