పార్ట్‌ టైం టీచర్ల సర్వీసులు రెగ్యులరైజ్‌ చేయాలి


తెలంగాణలోని అన్ని విశ్వ విద్యాలయాలలో పనిచేస్తున్న పార్ట్‌ టైం టీచర్ల సర్వీసులు రెగ్యులరైజ్‌ చేయాలని సీఎం కేసీఆర్‌కి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీ పార్ట్‌ టైం టీచర్స్‌ అసోసియేషన్‌ పిలుపుమేరకు వివిధ కళాశా లలా ఎదుట గేట్‌ ప్రొటెస్ట్‌ చేసి తదుపరి అంబేద్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాన్ని అంజేశారు. సమాన పనికి సమాన వేతనం నిబంధన స్ఫూర్తితో తమ సర్వీస్‌ లను రెగ్యులరైజ్‌ చేసి సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ఉన్నత విద్యను మెరుగు పరచాల్సిం ది గా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఓయు పార్ట్‌ టైం టీచర్స్‌ అసోసి యేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ సోమేశ్వర్‌ బోనకుర్తి ఆధ్వర్యంలో ఆర్ట్స్‌ కళాశాల నుండి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లి వినతి పత్రాన్ని డాక్టర్‌ బి. ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి అందించారు.ఈ కార్యక్రమంలో పార్ట్‌ టైం టీచర్స్‌ డాక్ట ర్‌ యుగేందర్‌, డాక్టర్‌ కె రామస్వామి, డాక్టర్‌ విష్ణు భూపతి,డాక్టర్‌ ఎన్‌ మధు సూదన్‌, డాక్టర్‌ ఎన్‌ సుందర్‌, డాక్టర్‌ పల్లవి, డాక్టర్‌ నాగమణి,డాక్టర్‌ సుమేధ, డాక్టర్‌ ఏడుకొండలు,డాక్టర్‌ కరుణాకర్‌ డాక్టర్‌ నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love