రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడలకు ఎంపికైన గోవిందరావుపేట జట్టు

– ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి

నవతెలంగాణ-గోవిందరావుపేట
సీఎం కప్ జిల్లా స్థాయి ఆటల పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి గోవిందరావుపేట మండల జట్టు రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలకు ఎంపికైనట్లు ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ  ములుగు జిల్లా సీఎం కప్ వాలీబాల్ క్రీడాంశంలో మండల జట్టు అద్భుతంగా ఆటలు ప్రదర్శించి ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి సీఎం కప్ వాలీబాల్ క్రీడా పోటీలకు ఎంపికైందని ఇది మండలానికి గర్వకారణమని అన్నారు. మంగళవారం కబడ్డీ క్రీడాంశం లోనూ బుధవారం వాలీబాల్ క్రీడా లోను జట్లు అద్భుతంగా రాణించి మండల ప్రతిష్టను రాష్ట్రస్థాయిలో ఇనుమడింపజేశారని క్రీడాకారులను పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు సీఎం కప్పు వల్ల వారి ప్రతిభను రుజువు చేసుకునే అవకాశం లభించిందని వచ్చిన అవకాశాన్ని గ్రామీణ యువత క్రీడాంశాలలో సద్వినియోగం చేసుకొని గ్రామానికి మండలానికి జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టారని అన్నారు. చీఫ్ మినిస్టర్ కప్ 2023 రాష్ట్రస్థాయిలో కూడా మన మండల జట్లు ప్రథమ స్థానంలో నిలిచి తప్పు తీసుకురావాలని మనమందరం ఆశిద్దాం అని అన్నారు. క్రీడాకారులు కూడా తమను ఎంతగానో ప్రోత్సహించిన ఎంపీపీ శ్రీనివాసరెడ్డికి మరియు వ్యాయామ ఉపాధ్యాయులకు కోచులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులతో పాటు క్రీడా వ్యాయామ ఉపాధ్యాయులు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.
Spread the love