ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలి

– ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారికి వినతి

నవతెలంగాణ కంఠేశ్వర్
ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ దుర్గాప్రసాద్ కు వినతి పత్రం అందించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అందించాలని  యూనిఫామ్ అందించాలని వీటితోపాటు బాత్రూమ్స్ మంచినీటి సమస్యలు పరిష్కరించి విద్యా సంవత్సరం ప్రారంభించే లోపు ఎటువంటి సమస్యలు లేకుండా సాఫీగా విద్యను అందించే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని ఎస్ఎఫ్ఐ గా కోరడం జరిగింది వీటితోపాటు ప్రయివేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు రంగు ఆర్భాటాలతో ఎక్కడో వచ్చిన ర్యాంకులను తమ బ్రాంచ్ లో వచ్చిన ర్యాంకులుగా తప్పుడు ప్రచారాలతొ విద్యార్థుల తల్లిదండ్రులను మోసగిస్తున్నారని, ఇటువంటి మోసాలను అరికట్టాలని అన్నారు. వీటితోపాటు ప్రభుత్వ పాఠశాలలో హాజరు పెరగాలంటే టీచింగ్ నాన్ టీచింగ్ పోస్తులు మరియు స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బోడ. అనిల్, నగర కార్యదర్శి  మహేష్,నాయకులు గణేష్, సందీప్, అజాద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love