విస్త్రృతంగా పోలీసుల తనిఖీలు

నవతెలంగాణ – ముత్తారం
ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు నగదు, ఇతర వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ముత్తారం ఎస్ఐ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. మండలంలోని మచ్చుపేట గ్రామ ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలను ఆపి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మధుసూదన్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరూ కూడా రూ.50వేల రూపాయల నగదును మించి తీసుకెళ్లరాదని, ఒకవేళ తీసుకెళ్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే ఎన్నికల అధికారులకు అప్పగించడం జరుగుతుందని సరైన ఆధారాలు చూపిస్తే ఆ నగదును తిరిగి అప్పగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love