రేషన్ షాపుపై జిల్లా సివిల్ సప్లై అధికారుల తనిఖీ..?

నవతెలంగాణ – మంథని
ప్రభుత్వం పంపిణి చేసిన సంచుల్లో నేరుగా పి.డి.ఎస్.బియ్యం స్మగ్లర్ల కు సరఫరా చేసినట్టు ఆరోపణలు వచ్చిన మంథని రేషన్ షాపును సోమవారం జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు తనిఖీ చేశారు.?.ఈమేరకు మంథని దొంతులవాడలో ఓ రేషన్ డీలర్ కు చెందిన రేషన్ షాపును జిల్లా సివిల్ సప్లయ్ అధికారి, మంథని రెవెన్యూ పుడ్ ఇన్స్పెక్టర్,మంథని అర్.ఐ. తదితరుల అధికారుల బృందం సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాగా మూడు రోజుల క్రితం తనిఖీకి వచ్చిన అధికారులకు గతంలో సీజ్ చేసిన 20 క్వింటాళ్ల బియ్యం స్టాక్ చూపించని సదరు డీలర్ ఆ సీజ్ చేసిన బియ్యాన్ని సర్కారు బియ్యం స్మగ్లర్ల కు విక్రయించినట్టుగా పలు ఫిర్యాదులు రావడంతో నేడు మరోసారి స్టాక్ నిల్వల పై అరా తీసినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..!
Spread the love