ఇనుములకు జాతీయ సేవారత్న అవార్డు: మార్చి 3న హైదరాబాద్ లో ప్రధానం.!  

నవతెలంగాణ – మంథని
సేవారత్న నేషనల్ అవార్డు 2024 సంవత్సరమునకు గాను పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సంఘ సేవకులు,మాజీ జర్నలిస్టు,న్యాయవాది, వికలాంగుల హక్కుల సంఘం నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధి ఇనుముల సతీష్ ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటి నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు గురువారం అవార్డు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్, బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వానం పత్రాన్ని హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో ఇనుముల సతీష్ కు అందజేశారు. కాగా మార్చి 3న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే బహుజన రైటర్స్ 7వ  కాన్ఫరెన్స్ సందర్భంగా సేవారత్న నేషనల్ అవార్డులను వీరికి అందజేయనునట్లు వారు  తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు మామిడాల సంతోష్ రెడ్డి, కాంట్రాక్టర్ ముస్కుల లోకెందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ అవార్డు ఇచ్చి ప్రోత్సహం అందించినా బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, ఇతర మిత్రులకు ఇనుముల సతీష్ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Spread the love