మతి భ్రమించి మాట్లాడుతున్న పుట్ట మధు

– చెక్ డ్యామ్ల పేరుతో ఇసుక రీచ్లకు పర్మిషన్ ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వమే
– ఇసుక అక్రమ రవాణా జరిగింది నీ కనుసన్నల్లోనే
– కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ 
నవతెలంగాణ – ముత్తారం
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కొల్పోవడంతో పెద్దపల్లి జడ్పి చైర్మన్ పుట్ట మధూకర్ మతిభ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ అన్నారు. ముత్తారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మంథని, ముత్తారం మండలాల్లో చెక్ డ్యామ్ల పేర తో ఇసుక రీచ్లకు పర్మిషన్లు ఇచ్చింది గత బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. మంథని నియోజక వర్గంలో ఇసుక అక్రమ రవాణా జరిగింది సైతం జడ్పి చైర్మన్ పుట్ట మధూకర్ కనుసన్నల్లోనే ఆరోపించారు. అధిక లోడ్లతో ఇసుక అక్రమంగా రవాణా జరపడం కారణంగా కోట్లు వెచ్చించి నిర్మించిన రోడ్లు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తిగా గుంతలమయంగా మారాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అధిక ఇసుక లోడ్ల జరుపుతున్న అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం జరిగిందని తెలిపారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఉనికి చాటుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తమ నేతలు మంత్రి శ్రీధర్ బాబు, యువ నాయకులు శ్రీసు బాబుపై జడ్పీ చైర్మన్ అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంథని నియోజక వర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తమ నేత మంత్రి శ్రీధర్ బాబు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. మంథని నియోజక వర్గ ప్రజలకు శ్రీపాద ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న యువ నాయకుడు శ్రీనుబాబుపై విమర్శలు చేసే స్థాయి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కు లేదని అన్నారు. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చిన నేనున్నానంటూ యువ నాయకుడు శ్రీనుబాబు ముందుటారని, తమ నేతన విమర్శించే సహించబోమని హెచ్చరించారు. అనంతరం మండల కేంద్రంలో మానేరు నుంచి ఇసుక లోదు తో వెళ్తున్న లారీలను ఆపి డ్రైవర్లతో మాట్లాడారు. డ్రైవర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధిక లోడుతూ లారీలలో ఇసుక తరలించడం లేదని, గత ప్రభుత్వంలోనే అలా జరిగిందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, యువజన సంఘం మండల ఉపాధ్యక్షుడు బోడ రత్నాకర్, నాయకులు రాపల్లి రామన్న, లక్కం ప్రభాకర్, ఆ కోజు అశోక్ చారి, చెలకల ఓదెలు యాదవ్, చల్ల సది, తాడవేణి శంకర్ తదితరులున్నారు.
Spread the love