Thursday, July 9, 2026
E-PAPER
Homeజాతీయంగుజరాత్‌లో కూలిన దృష్టి-10 స్టార్‌లైనర్‌

గుజరాత్‌లో కూలిన దృష్టి-10 స్టార్‌లైనర్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: భారత నావికాదళానికి చెందిన దృష్టి -10 స్టార్‌లైనర్‌ (మానవ రహిత వైమానిక విమానం) గురువారం గుజరాత్‌లో కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అన్నారు. పోర్‌బందర్‌ జిల్లా ధరంపూర్‌ గ్రామానికి సమీపంలో విమానం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. శిక్ష‍ణ నిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, విచారణకు ఆదేశించామని అన్నారు. సాంకేతిక లోపం, కమ్యూనికేషన్‌ లింక్‌ తెగిపోవడం లేదా మరేదైన వ్యవస్థాగత వైఫల్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అనే అంశంపై విచారణ చేపడుతున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాద స్థలం నుంచి శిథిలాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్‌ భాగస్వామ్యంతో, అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ తమ హైదరాబాద్ ప్లాంట్‌లో లైసెన్స్ కింద దృష్టి -10 స్టార్‌లైనర్‌లను రూపొందిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -