నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. గవర్నర్ల నియామకం, బదిలీలపై గురువారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. బోస్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తెలంగాణ కొత్త గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు.
శివ ప్రతాప్ శుక్లా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన శుక్లా 2014 ఎన్డీఏ కేబినెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి గా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ ను కేంద్రం మహారాష్ట్ర గవర్నర్ గా నియమించింది. 2024 జులై 31 నుంచి జిష్ణుదేవ్ వర్మ ఏడాదిన్నార పాటు తెలంగాణ గవర్నర్ గా విధులు నిర్వర్తించారు. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్పులు చేశారు.



