Friday, July 10, 2026
E-PAPER
Homeజాతీయంనీట మునిగిన ఎల్‌పీజీ ప్లాంట్‌ … కొట్టుకుపోయిన 3వేల గ్యాస్ సిలిండర్లు

నీట మునిగిన ఎల్‌పీజీ ప్లాంట్‌ … కొట్టుకుపోయిన 3వేల గ్యాస్ సిలిండర్లు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఒక ఎల్‌పీజీ ప్లాంట్‌ కూడా నీట మునగడంతో అందులోని మూడు వేల సిలిండర్లు పాతాళగంగా నదిలో కొట్టుకుపోయాయి. రాయ్‌గఢ్‌లో హెచ్‌పీసీఎల్‌కు చెందిన పాతాళగంగ ఎల్‌పీజీ బాట్లింగ్‌ యూనిట్‌ ప్రహరీ గోడ భారీ వర్షాలకు కూలింది. దీంతో భారీగా వరద నీరు బాట్లింగ్‌ యూనిట్‌ ప్రాంగణంలోకి చేరుకుంది. దీంతో అక్కడ నిల్వ ఉంచిన వేలాది సిలిండర్లు పాతాళగంగ, సముద్రపు ఉప్పునీటి కాలువ ఖర్పడ క్రీక్‌లో కొట్టుకుపోయాయి.

దీనిలో గ్యాస్‌ నింపిన సిలిండర్లు కూడా ఉన్నాయి. ఒక వంతెన సమీపంలో కొట్టుకుపోతున్న వేలాది సిలిండర్ల వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయ్యాయి. నదీ ప్రవాహంలో కొట్టుకువచ్చిన సిలిండర్లు ఎవరికైనా లభిస్తే వాటిని వెంటనే పోలీసులు, అధికారులు, గ్యాస్‌ కంపెనీకి అప్పగించాలని రాయ్‌గఢ్‌ కలెక్టర్‌ కిషన్‌ జావ్లే పౌరులకు విజ్ఞప్తి చేశారు. కొట్టుకు వచ్చే సిలిండర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని, ఒక వేళ గ్యాస్‌తో నింపి ఉన్నా వాటిని ఉపయోగించే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్‌ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -