Friday, July 10, 2026
E-PAPER
Homeజాతీయంమంత్రి వాకిటి శ్రీహరికి నిరసన సెగ

మంత్రి వాకిటి శ్రీహరికి నిరసన సెగ

- Advertisement -
  • తెలంగాణ మత్స్యకారుల కార్మికుల సంఘం నాయకుల ఆందోళ

నవతెలంగాణ-హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో మంత్రి వాకిటి శ్రీహరికి నిరసన సెగ తగిలింది. కోహెడ చేపల మార్కెట్ హోల్సేల్ చేపల మార్కెట్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ మత్స్యకారుల కార్మికుల సంఘం(TMKMKS) నాయకులు ఆందోళన చేపట్టారు. చేప రొయ్య పిల్లల కొనుగోలు కోసం మత్స్య సొసైటీ ఖాతాల్లో నగదు జమచేయాలని డిమాండ్ చేశారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు నిరసన కారులను అడ్డుకున్నారు. TMKMKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు గొరేంకల నర్సింహ, రాష్ట్ర సహాయ కార్యదర్శి తేలు ఇస్థారి, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బోద్రమోని నరసింహ, తడబోయిన కృష్ణమూర్తి తదితర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -