నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మార్కెట్‌గా గుర్తింపు పొందిన భారత్ లోకి ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మక టి 20 టోర్నీ బిగ్ బాష్ లీగ్ అడుగుపెట్టనుంది. విదేశీ క్రికెట్ లీగ్ భారత్‌లో మ్యాచ్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ చారిత్రక నిర్ణయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడి, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అధికారికంగా ప్రకటించారు.
బిగ్‌బాష్ లీగ్ (బిబిఎల్) 2026-27 ప్రారంభ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. డిసెంబర్ 12న మెల్‌బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ విషయాన్ని మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడి, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సంయుక్తంగా ప్రకటించారు.


