Friday, July 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు తుది విడత రైతు భరోసా సాయం

నేడు తుది విడత రైతు భరోసా సాయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రైతులకు ప్రభుత్వం నేడు రైతు భరోసా పథకం తుది విడత నిధులను విడుదల చేయనుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి రూ.1,009 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో ఇప్పటివరకు విడుదలైన నిధులతో కలిపి మొత్తం రైతు భరోసా సాయం రూ.8,759 కోట్లకు చేరుతుంది. గత నెల 30న ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటికే 74 లక్షల మంది రైతులకు, 1.45 కోట్ల ఎకరాల భూములకు రూ.7,750.45 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. సాంకేతిక కారణాలతో సాయం అందని రైతులు, కొత్తగా నమోదైన అర్హులకు కూడా త్వరలోనే నిధులు విడుదల కానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -