- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ మధ్యంతర ఊరటనిచ్చింది. ఈ నియామకాలపై స్టే విధించాలన్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే, ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలికమని, కేసులో తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే, నియామకాలు పొందిన వారు తొలి నెల జీతం అందుకునేలోపు కేసు విచారణను పూర్తి చేయాలని కోర్టు నిర్ణయించింది. తదుపరి విచారణను జూలై 21కు వాయిదా వేసింది.
- Advertisement -


