పిఎస్ లో ఫిర్యాదు చేసిన మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య
నవతెలంగాణ వర్ధన్నపేట
వర్ధన్నపేట మండలం కట్రియాల గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయ పాలకమండలి తప్పుడు లెక్కలతో దేవుడి సొమ్మును దుర్వినియోగానికి పాల్పడ్డారని వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య పాలకమండలిపై పలు విషయాలను వెల్లడించారు.
కట్రియాల మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకమండలి సంక్రాంతి సందర్భంగా వచ్చిన కానుకలు ఆదాయాన్ని తప్పుడు లెక్కలతో దుర్వినియోగం చేశారని, మరుసటిరోజే మేడారంలో దావత్ లు చేసుకుంటూ దేవుని సొమ్మును దేవుని అభివృద్ధికి చేయకుండా దుర్వినియోగానికి పాల్పడ్డారని వీరిపై చర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతోపాటు గ్రామంలో సైతం ప్రజలు ఇలాంటి చర్యలను ఖండించాలని ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
అభివృద్ధి పేరా వేసిన పాలకమండలి కమిటీ దేవుడి సొమ్మును దేవుడికి చెందాలన్నారు. లెక్కల దుర్వినియోగంపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య డిమాండ్ చేశారు.



