Monday, March 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌తో స్నేహం కోరుకుంటున్నాం: చైనా విదేశాంగ మంత్రి

భారత్‌తో స్నేహం కోరుకుంటున్నాం: చైనా విదేశాంగ మంత్రి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. భారత్‌తో స్నేహాన్ని కోరుకుంటున్నట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలు ఒకరినొకరు ప్రత్యర్థులుగా కాకుండా, పరస్పర సహకారం అందించుకునే భాగస్వాములుగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. బీజింగ్‌లో జరిగిన 14వ జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ సెషన్ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత్‌తో సత్సంబంధాలు కలిగి ఉండటం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -