Monday, March 9, 2026
E-PAPER
Homeసినిమాఅందరికీ కనెక్ట్‌ అయ్యే ఎంటర్‌టైనర్‌

అందరికీ కనెక్ట్‌ అయ్యే ఎంటర్‌టైనర్‌

- Advertisement -

రైటర్‌- డైరెక్టర్‌ కశ్యప్‌ శ్రీనివాస్‌తో కలిసి తరుణ్‌ భాస్కర్‌ ‘గాయపడ్డ సింహం’తో అలరించబోతున్నారు. సప్తస్వ మీడియా వర్క్స్‌, పిఓవి స్టోరీస్‌, జీ స్టూడియోస్‌ నిర్మిస్తున్నాయి. పవన్‌ సాదినేని సమర్పిస్తున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన ఫన్‌ ప్రమోషనల్‌ ర్యాప్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. హీరో తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ,’ఈ సాంగ్‌ మీ అందరికీ నచ్చడం హ్యాపీగా ఉంది. కశ్యప్‌ శ్రీనివాస్‌ అసలైన హీరో ఈ సినిమాకి. తప్పకుండా ఈ సినిమాని మీ ఫ్రెండ్స్‌ తో ఫ్యామిలీతో కలిసి చూడండి’ అని అన్నారు.
‘ఈ సినిమాని మా డైరెక్టర్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్టైనర్‌గా తీశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని పాటలు కూడా చక్కగా కుదిరాయి. ఒక డైరెక్టర్‌గా తరుణ్‌ అంటే మనందరికీ ఇష్టం. ఈ సినిమాతో యాక్టర్‌గా ఇష్టపడతారు. ఈ సినిమాలో చాలా సర్ప్రైజులు ఉన్నాయి. ఒక్కొక్కటి రివీల్‌ చేేస్తూ ఉంటాం. ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’ అని ప్రొడ్యూసర్‌ భాను కిరణ్‌ చెప్పారు. డైరెక్టర్‌ కశ్యప్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ,’అందరూ మన కలలని చేరుకోవాలి. ఈ ప్రయాణంలో అందరం గాయపడతాం. గాయపడ్డ సింహాలవుతాం. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది. మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్‌ చేస్తుంది. తరుణ్‌ బెస్ట్‌ పెర్ఫార్మన్స్‌ ఇచ్చారు. మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్‌ చేస్తారు’ అని తెలిపారు.
లిరిక్‌ రైటర్‌ రాపర్‌ ప్రమోద్‌ అసుర మాట్లాడుతూ,’సినిమా చాలా క్రేజీగా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. ఇంకో నాలుగు పాటలు ఉన్నాయి. ఆ పాటలన్నీ కూడా మిమ్మల్ని అలరిస్తాయి’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -